చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో రెండు ప్ర‌కృతి విపత్తులు ఉత్త‌రాంధ్ర‌ను కంటి మీద కునుకులేకుండా చేశాయి. తీవ్రమ‌యిన న‌ష్టాల‌ను మిగిల్చాయి. ఆ  రోజు యావ‌త్ యంత్రాగాన్నీ ఇక్క‌డ మోహ‌రింప‌జేసి, యుద్ధ మేఘాల మీద ప‌నులు జ‌రిగేలా చేశారు.  అదేవిధంగా పంట న‌ష్టాల అంచ‌నాల‌నూ, ఆస్తి న‌ష్టాల వివ‌రాలనూ అంచ‌నా వేయించి, ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. వీటిపై కేంద్రంతో మాట్లాడి ప‌రిహారం వ‌చ్చేందుకు కృషి చేశారు.
అక్టోబ‌రు నెల వ‌చ్చిందంటే చాలు మా ప్రాంతం చిగురుటాకులా వ‌ణికి పోతుంది. మా ప్రాంతం అంటే శ్రీ‌కాకుళం అని అర్థం. రెండు భీక‌ర తుఫానులు గతంలో  ఎదుర్కొన్న వైనం ఒక‌టి చంద్ర‌బాబు అనుభ‌వంలో ఉంది. హుద్ హుద్ తుఫాను 2018లో ఏర్పడ‌గా, 2019లో తిత్లీ తుఫాను హోరు వినిపించింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు తుఫానుల సంద‌ర్భంలోనూ అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బా బు నాయుడు ఆఘ‌మేఘాల మీద ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని, అక్క‌డే రోజుల పాటు ఉండి, అధికారుల‌ను ప‌రుగులు పెట్టించారు. ముఖ్యంగా హుద్ హుద్ స‌మ‌యంలో వైజాగ్ మ‌హాన‌గ‌రం అత‌లాకుత‌లం అయిపోయింది.



ప‌లు చెట్లు నేల కూలాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ తీగ‌లు తెగి ప‌డ్డాయి. ఇంత‌టి ఘోరక‌లిలోనూ చంద్ర‌బాబు నిబ్బ‌రంగా ఉన్నారు. త‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించారు. మూడు రోజుల్లోనే విద్యుత్ స‌ర‌ఫ‌రాను విశాఖ న‌గ‌రం అంతటా వ‌చ్చేందుకు కృషి చేశారు. విద్యుత్ స్తంభాల మార్పున‌కు, కొత్త లైన్ల ఏర్పాటుకు ఎంత‌గానో కృషి చేశారు. బాధిత ప్రాంతాల‌న్నింటా తిరిగి ప్ర‌జ‌ల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. హుద్ హుద్ నుంచి వైజాగ్ కోలుకునే వ‌ర‌కూ ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పి, స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

హుద్ హుద్ త‌రువాత తిత్లీ తుఫాను శ్రీ‌కాకుళం జిల్లాతో స‌హా ఉత్త‌రాంధ్ర‌ను అత‌లాకుత‌లం చేసింది. తీవ్ర వేగంతో వీచిన గాలుల కారణంగా అర‌ణి, జీడి తోట‌ల‌కు పంట న‌ష్టం వాటిల్లింది. కొబ్బ‌రి చెట్లు నేల కూలాయి. తుఫాను పూర్తిగా ఉద్దానానికి ఏమీ లేకుండా చేసింది. అప్పుడు కూడా చంద్ర‌బాబు క్షేత్ర స్థాయికి చేరుకుని సెక్ర‌టేరియ‌ట్ స్థాయి అధి కారుల‌ను సైతం ఇక్క‌డికి తీసుకు వ‌చ్చి ఆఘ‌మేఘాల మీద ప‌నులు చేయించారు. ఫ‌లితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకుంది. వివిధ ప్రాంతాల‌లో ఎంపీ రామూ తో పాటు లోకేశ్ ప‌ర్య‌టించి క్షేత్ర స్థాయిలో న‌ష్టాల‌ను ప‌రిశీలించి వెళ్లారు. ఈ విధంగా రెండు తుఫానులు ఎదుర్కొని ప్ర‌జ‌ల‌కు మ‌నో నిబ్బ‌రం ఇచ్చిన లీడ‌ర్ చంద్ర‌బాబు అని శ్రీ‌కాకుళం టీడీపీ  నాయ‌కులు నాటి ప‌రిణామాల‌ను త‌ల్చుకుంటూ త‌మ నాయ‌కుడ్ని కీర్తిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: