ఒక‌ప్పుడు స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్ర‌జ‌లు అంటే ఆంధ్రా వాళ్ల‌కు చాలా చుల‌క‌న అని తెలంగాణ ప్ర‌జ‌లు ఆరోపించే వారు. స‌మైక్య పాల‌న లో ఎక్కువ మంది ఆంధ్రాకు చెందిన వారే రాష్ట్రాన్ని పాలించారు. స‌మైక్య పాల‌కుల పాల‌న‌లో నాటి తెలంగాణ ఏ మాత్రం అభివృద్ధి చెంద‌లేద ని అక్క‌డ ప్ర‌జ‌లు , నాయ‌కులు ఆరోపిస్తూ ఉండేవారు. అదంతా గ‌తం ఇప్పుడు స‌మైక్య రాష్ట్రం తెలంగాణ‌, ఆంధ్రా గా విడిపోయింది. అయి తే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అస‌లు ఆంధ్రా అంటే ఏముంది అని అక్క‌డ పాల‌కులు, ప్ర‌జ లు ప్ర‌శ్నిస్తున్నారు.

చివ‌ర‌కు నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లీన‌రీలో మాట్లాడుతూ ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెడితే గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారని అన్నారంటే ఇక్క‌డ ఉన్న వాళ్ల‌కు పాల‌న చేత కావ‌డం లేద‌ని అనుకోవాలి. ఇక తెలంగాణ లో ప‌థ‌కాలు చూసిన ఏపీలో త‌న మిత్రులు, ఇత‌రులు ఇక్క‌డ కూడా టీఆర్ ఎస్ పెడితే గెలిపించు కుంటామ‌ని చెపుతున్నార‌ని ఓ విధంగా ఎద్దేవా నే చేశారు.

కేసీఆర్ వ్యాఖ్య‌లు ఇలా ఉంటే తనను భీమవరంలో పోటీ చేయాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారని కేటీఆర్ ఒకసారి అన్నారు. ఇక కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఏపీలో ఆయ‌న అభిమానులు కావ‌చ్చు.. ఆయ‌న కులం వాళ్లు కావ‌చ్చు భారీగా ఫ్లెక్సీలు క‌డ‌తారు. విచిత్రం ఏంటంటే ఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీల‌లో చాలా మంది ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. వారి పిల్ల‌ల‌ను ఇక్క‌డే చ‌దివించు కుంటున్నారు.

ఇప్పుడు ఏపీలో కుళ్లు , కుతంత్రాల రాజ‌కీయాలు మిన‌హా ఇక్క‌డ జ‌రిగే అభివృద్ధి లేదు. ఇప్ప‌ట్లో జ‌రుగుతుంద‌న్న ఆశ‌లు కూడా ఎవ్వ‌రూ లేరు. ఇక ఏపీకి చెందిన ప్ర‌తి ఒక్క‌రు హైద‌రాబాద్ లోనే స్థిర‌ప‌డాల‌ని కోరు కుంటున్నారు. దీంతో వీరి వ‌ల్లే ఇక్క‌డ రియ‌ల్ వ్యాపారం భారీగా పుంజుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: