ఇటీవలే తెలంగాణ రాజకీయాలు అన్నింటినీ కూడా ఒక ఊపు ఊపేసింది హుజురా బాద్ ఉప ఎన్నిక. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు.. ఈటెల రాజేందర్ ఆత్మ గౌరవానికి మధ్య ఈ ఉప ఎన్నిక జరిగింది అని చెప్పాలి. ఈ ఉప ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పాల్గొన్నప్పటికీ అటు అసలు యుద్ధం మాత్రమే అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య సాగింది అనే చెప్పాలి. ఇంకా ఎంతో హోరా హోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీఈటెల రాజేందర్ విజయం ఒక మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి.



ఏకంగా కేంద్రంలోని పెద్దలు సైతం ఈటెల రాజేందర్ విజయాన్ని అభినందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తిరుగులేని చరిష్మా ని కొనసాగించిన అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి.. ఇక బిజెపి తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈటల రాజేందర్ పై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు ఇకపోతే ఇటీవల ఈటల రాజేందర్ రాజ్ భవన్ లో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. బీజేపీ నేతలు అందరితో కలిసీ రాజ్ భవన్కు వెళ్లారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.


 సాధారణం గా ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన సమయం  లో పుష్పగుచ్ఛం ఇచ్చి ఇక ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలపడం సర్వ సాధారణం గా జరిగేదే. కానీ అటు బిజెపి తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈటల రాజేందర్ అటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మాత్రం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కష్టపడి గెలిచారు అంటూ భుజం తట్టి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ ప్రజల రుణం తీర్చుకోలేనిది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: