ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లను అరాచక పాలన రోజు రోజుకీ మితిమీరిపోతుంది. ఇప్పటికే ఎన్నో దారుణమైన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు తాలిబన్లు. ముఖ్యంగా మహిళలను అయితే కేవలం సెక్స్ బానిసలుగా మాత్రమే చూస్తూ దారుణం గా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ పాలన చేపట్టిన నాటి నుంచి ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికేతాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని రకాల సంక్షోభాలు కూడా దేశాన్ని చుట్టుముడుతున్నాయి.


 ఇలాంటి సమయంలో ఏకంగా తాలిబన్లకు సవాలు విసురుతూ ఐ ఎస్ ఐ ఎస్ తీవ్రవాదులు వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడుతు ఉండటం మాత్రం ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరిలో ప్రాణ హాని కలిగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుందో అన్న దానిపైనే అక్కడి ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది. ఇక తాలిబన్లు   చేస్తున్న పని మాత్రం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికేఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న జైలును బద్దలుకొట్టి కరుడుగట్టిన తీవ్రవాదులుసైతం బయటకు పంపించారు తాలిబన్లు.. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు.


 దీంతో ప్రజలందరూ భయంతో వణికి పోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు కరువు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయం లో తాలిబన్లు తీసుకున్న  మరో కీలక నిర్ణయం మాత్రం సంచలనంగా  గా మారిపోయింది. జైల్లో ఉన్న 210 మంది ఖైదీలను విడుదల చేశారు తాలిబన్లు. ఇక తాలిబన్ల తీసుకున్న  నిర్ణయం కాస్త దేశ ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాలిబన్లకు సవాల్ విసురుతూ బాంబు పేలుళ్లకు పాల్పడినా అడ్డుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు మరింత మంది నేరస్తులను కూడా అటు జైలు నుంచి విడుదల చేయడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: