భార్యా భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. చిన్నపాటి కుటుంబ కలహాల తోనే జీవితం వృధా అయి పోయిందని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే సంగారెడ్డి జిల్లా లో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.. క్షణికావేశం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది . సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూ ఎమ్ ఐ సి కాలనీ లో భార్య పిల్లలతో కలిసి చంద్రకాంత్ నివాసం ఉంటున్నాడు..
హ్యాపీగా ఉన్న వీరి సంసారం లో గొడవలు జరగడం మొదలైంది. భార్య లావణ్య తో గొడవ పడ్డాడు. ఇక్కడ ఇద్దరి మధ్య గొడవపడి మాటా మాటా పెరగడంతో మనస్తాపం చెందిన భార్య లావణ్య తన పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన భర్త చంద్రకాంత్ చివరికి జీవితం వృధా అని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పిల్లలతో బయటికి వెళ్లి లావణ్య ఆందోలు మండలంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.