ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య నిన్న ఉద‌యం 8 గంట‌ల‌కు మృతి చెందిన విష‌యాన్ని తెలుసుకున్నప్ప‌టి నుంచే ప‌లువురు నేత‌లు తొలుత బంజార హిల్స్ స్టార్ హాస్పిట‌ల్‌, ఆ త‌రువాత రోశ‌య్య నివాసానికి చేరుకుని ప‌లువురు రోశ‌య్య‌కు సంతాపం ప్ర‌క‌టించి.. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రోశ‌య్య నివాసానికి వెళ్లి రోశ‌య్య పార్థివ దేహానికి నివాళుల‌ర్పించారు.

అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. ఆ త‌రువాత మీడియాతో మాట్లాడుతూ నిన్న ఈ వార్త విన్న వెంట‌నే బాధ క‌లిగింద‌ని.. నిన్న నేను ఒక్క లేను అని.. రాత్రి చివ‌రి విమానానికి వ‌చ్చాను. వ్య‌క్తిగ‌తంగా నాకు చాలా బాధాక‌రం అని.. కిష‌న్‌రెడ్డి చెప్పారు.  త‌ప్ప‌కుండా ఎవ‌రికీ ఏ రకంగా రాసి పెట్టి ఉంటుందో  ఆర‌కంగా జ‌రుగుతుందని, రోశ‌య్య మ‌నంద‌రినీ వ‌దిలి వెళ్లారు. వారి ఆత్మ‌శాంతి చేకూరాల‌ని కోరారు కిష‌న్‌రెడ్డి. వారికి దేశ ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర మోడీ త‌రుపున కూడా ప్ర‌గాఢ‌మైన సానుభూతిని వ్య‌క్త ప‌రిచారు.  రోశ‌య్య మృతి తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని లోటు అని.. మా మ‌ధ్య రాజ‌కీయ వైరుద్య‌మే ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌తంగా అందరం క‌లిసి మెలిసి ఉంటామ‌ని స్ప‌ష్టం చేసారు కిష‌న్‌రెడ్డి.

పార్టీల‌కు అతీతంగా  బీజేపీ, టీడీపీ, క‌మ్యూనిస్టు అన్ని పార్టీల‌ నేత‌లు సంద‌ర్శించి సంతాపాన్ని ప్ర‌క‌టించారు.  మ‌రికొద్ది సేప‌ట్లో  కాంగ్రెస్ సీనియర్ నేత  మల్లికార్జున ఖర్గే రోశ‌య్య మృత‌దేహానికి నివాళుల‌ర్పించ‌నున్నారు. అదేవిధంగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా రోశ‌య్య నివాసానికి చేరుకుని కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా రోశ‌య్య‌కు నివాళుల‌ర్పించారు. మ‌రికాసేప‌ట్లోనే రోశ‌య్య నివాసంలో పూజ‌లు నిర్వ‌హించి.. ఆ త‌రువాత పార్థివ‌దేహాన్ని గాంధీ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. ఆ త‌రువాత అక్క‌డి నుంచి అంతిమ యాత్ర‌గా వెళ్లి కొంప‌ల్లిలోని రోశ‌య్య ఫాంహౌస్‌లో అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: