ప్రస్తుతం కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను చుట్టేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ తో ఎంతమంది ఇబ్బందులు పడిన వారు. ఇక ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ పేరుతో ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడి పోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ వైరస్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేందుకు అధ్యయనాలు మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే రోజురోజుకు ఓమిక్రాన్ వైరస్ గురుంచి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్.



 ఇప్పటికే రెండవ దశలో వ్యాప్తి చెందినది డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ 5 రెట్లు ప్రమాదకారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా వైరస్ కు సంబంధించి మరో వార్త కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. కరోనా వైరస్ బారిన ఒకసారి పడితే దాదాపు నెలలపాటు కూడా శరీరంలోని వివిధ భాగాలపై వైరస్ ప్రభావం చూపుతుంది అనే విషయం ఇటీవల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన 44 మంది మృతదేహాలపై రోజుల పాటు వరుసగా పరీక్షలు జరిపారు శాస్త్రవేత్తలు.



 ఈ క్రమంలోనే కరోనా వైరస్ సోకినప్పటినుంచి   ఏకంగా ఏడున్నర నెలలపాటు వైరస్ మానవ శరీరం లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. శరీరంలోని పలు అవయవాలు సహా మెదడులో కూడా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం భౌతిక లక్షణాలు ఉన్న వారిలో మాత్రమే కాదు లక్షణాలు లేని వారిలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడినట్లు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇలా దాదాపు దాదాపు కరోనా వైరస్ బారిన పడిన వారి శరీరంలో ఏడు నెలలపాటు వైరస్ అలాగే సజీవంగా ఉంటుంది అని అంటున్నారు శాస్త్రవేత్తలు .

మరింత సమాచారం తెలుసుకోండి: