పుష్ప సినిమాకు సంబంధించి మొద‌ట్నుంచి మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ కు సంబంధించి తీసిన ఈ చిత్రం ఇప్పుడు అన్ని భాషల్లోనూ క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్ర‌భంజనం సృష్టిస్తోంది. అస‌లు ద‌ర్శ‌క, నిర్మాత‌లు ఎవ్వ‌రు కూడా ఊహించ‌ని విధంగా మంచి వసూళ్లు ఉండ‌డంతో చిత్ర వ‌ర్గాల ఆనందాల‌కు, బ‌న్నీ ఫ్యాన్స్ సంతోషాల‌కు అంతే లేకుండా ఉంది. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో అయితే ఈ  సినిమాకు మంచి స్పందన వ‌స్తోంది. తొలుత ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా త‌రువాత తరువాత చాలా చోట్ల మంచి సినిమా అన్న పేరును స్థిరం చేసుకుంది.


పుష్ప మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు
క‌ర్ణాట‌క‌లో 6.80 కోట్లు
త‌మిళ‌నాడులో 3.70 కోట్లు
ఆంధ్రా తెలంగాణ‌లో 35.50 కోట్లు
కేర‌ళ‌లో 2.50 కోట్లు
మొత్తం మొద‌టి రోజు క‌లెక్ష‌న్లే యాభై కోట్లు పైగా (52.80కోట్లు)
రెండో రోజు 36 కోట్ల‌కు పైగా (36.40కోట్లు)
మూడో రోజు 38 కోట్ల‌కు పైగా (38.85కోట్లు) ఈ సినిమా వ‌సూలు చేసింది.
నాలుగో రోజు 19.65కోట్లు రాగా
ఐదో రోజు 13.60కోట్లు వ‌చ్చాయి..
ఆరో రోజు 9.50కోట్లు రాగా
ఏడో రోజు 7.55కోట్లు వ‌చ్చాయి..
ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న వివరం అనుసారం
మొత్తంగా మొద‌టి వారం గ్రాస్ 177 కోట్ల‌కు పైగా అని తేలింది.
రెండో వారం క‌లెక్ష‌న్లు కూడా క‌లుపుకుంటే 213.50 కోట్లు అని తెలుస్తోంది.



పుష్ప సినిమాకు సంబంధించి మొద‌ట్లో పెద్ద‌గా ఎవ్వ‌రూ సానుకూలంగా స్పందించ‌లేదు. బన్నీ చేసిన ప్ర‌క‌ట‌న‌లు కూడా పెద్ద గొప్ప‌గా లేక‌పోగా..ఎప్ప‌టిలానే యాటిట్యూడ్ ను షో చేసే విధంగా కొన్ని మాట‌లు చెప్పి త‌న సినిమాను తానే గొప్ప‌గా పొగుడుకోవ‌డంలో మిగ‌తా హీరోల క‌న్నా ఓ అడుగు ముందే ఉన్నాడు. అదేవిధంగా ప్రీ రిలీజ్ షో కు కూడా రాజ‌మౌళి వ‌చ్చిన చెప్పిన మాట‌లు కూడా సినిమాపై ప్ర‌భావితం చేశాయి. అఖండ ఫంక్ష‌న్ కు బ‌న్నీ అతిథిగా రావ‌డంతో కొంత‌లో కొంత నంద‌మూరి
అభిమానులు కూడా ఈ సినిమాకు అండ‌గా నిలిచారు. ఇవ‌న్నీ క‌లిసివ‌చ్చాయి.

 



మరింత సమాచారం తెలుసుకోండి: