వివాదాల్లో మరోసారి ఉండడాన్ని ఇష్టపెట్టుకుంటున్నారు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అసలీ అసందర్భ ప్రేలాపనల కారణంగానే బీజేపీ ఎమ్మెల్యే మరోసారి నెట్టింట్లో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. దేశీయ ముస్లిం అయిన కలాంపై ప్రేమ కురిపిస్తూ పాకిస్తాన్ పెద్దఅయిన జిన్నాపై ద్వేషం కురిపిస్తూ గుంటూరులో ఉన్న జిన్నా టవర్ ను కూల్చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారా యన. దీని వల్ల ఇప్పుడు దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే ఆంధ్రా ప్రాంతంలోకి వచ్చి విధ్వంసం సృష్టించడం సాధ్యమేనా?
వాస్తవానికి ఆ రోజు కలాంను రాష్ట్రపతిని చేసింది ఎన్డీఏ హయాంలో ఉన్న ప్రభుత్వమే దీనినెవ్వరూ కాదనరు. ఆ రోజు ప్రతిపక్ష కూటమి అయిన యూపీఏ మంచి మద్దతు ప్రకటించింది. అయితే ప్రాంతీయ పార్టీలు కూడా అంతే స్థాయిలో ఈ పెద్దాయనకు మద్దతు పలికి, ఒక మేథావికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చింది. అందుకే కలాం అంటే పార్టీలకు అతీతంగా ప్రేమ. అంతేకాదు దేశం తలెత్తుకున్న సందర్భాల్లో ఈ పేద ముస్లీం బాలుడు ఎంతో సహకరించాడు. ఎందరో సామాన్య కుటుంబాలకు ఆదర్శం అయి ఉన్నారు. అలాంటి వారు పేరు పెట్టాలని అనుకోవడం తప్పు కాదు కానీ కలాం ముస్లిం కనుక జిన్నా స్థానంలో ఆయన పేరు పెట్టాలన్న ఆలోచన ఇప్పుడెందుకు ఈయనకు వచ్చిందని! అసలీ అప్రస్తుత వివాదంలో కలాం పేరును కానీ మరొకరిని కానీ చొప్పించడం ఎందుకు?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి