మ‌న‌కూ బీహార్ కూ ఏంటి సంబంధం అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే బీహార్ లో ఉన్న వ‌న‌రులు మ‌న‌కు లేక‌పోయినా లేదా మ‌న వ‌న‌రులు బీహార్ లో ఉండ‌క‌పోయినా అస‌లు ప్రాంతీయంగా పోలిక‌లు లేక‌పోయినా మ‌నం వాళ్లూ ఒక్క‌టే.. ఆ విధంగా మోడీ మంచి రాజ‌కీయ‌మే న‌డుపుతున్నారు. కానీ ఏపీ హోదాకు సంబంధించి పార్లమెంట్ లో ఎన్ని అడిగినా ఎంత అడిగినా మ‌న త‌ర‌ఫు గొంతుక ఒక్క‌టే అయి ఉండి ఉంటుంది.

బీహారుకు ప్ర‌త్యేక హోదా ఇస్తే ఆంధ్రావ‌నికి కూడా ఇచ్చే అవకాశం ఉందో లేదో ఆలోచిస్తాం. అవ‌స‌ర‌మైన విధంగా ఏపీకి సాయం చేస్తాం..అని కేంద్రం అంటోంది. దీంతో ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌నే తేలిపోయింది. మ‌రి! ఈ పాటిదానికి కేంద్రం మెడ‌లు వంచుతాం మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడిగితిరి..జ‌గ‌న్. ఆ మాట‌కు అనుగుణంగానే జ‌నం 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇంకేం కనీసం అడ‌గాలి క‌దా! కానీ అడ‌గ‌రు.

గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క‌రిగిపోయింది. కాల గ‌ర్భంలో  మ‌రికొద్ది సేప‌ట్లో క‌లిసిపోతుంది. ఏం కాదు మ‌న నాయ‌కులకు, వారి వారి ప్రాంతాల వారికి ఇంకా అంద‌రికీ ఏం కాదు. ఎందుకంటే మ‌నం ఆలోచించి ఉద్య‌మించి సందేహించి సంశ‌యించి నిల‌దీత అన్న‌ది ఒక‌టి చేస్తే క‌దా! మ‌న‌కు కానీ మ‌న ప్రాంతాల‌కు కానీ మ‌న నాయ‌కుల‌కు కానీ ఏదో ఒక‌టి అవ్వ‌డానికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమీ కాదు కాల‌మ‌నే గ‌ర్భంలో 2021 చేరిపోతుంది. అటుపై 2022 అంటూ మ‌నం కొత్త ఏడాది కి కొత్త వెల్కంలు మాత్రం ముగ్గుల రూపంలో బుగ్గ‌ల సిగ్గుల రూపంలో చెబుతూనే ఉంటాం. అంతేకానీ ఇక్క‌డెవ్వ‌రూ ఉద్యమించరు. ఎవ్వ‌రూ ఎవ్వ‌రినీ ప్ర‌శ్నించ‌రు. కానీ హోదా వ‌స్తే వ‌చ్చే రాయితీల‌ను మాత్రం అనుభ‌వించేందుకు సిద్ధం అవుతారు. అందులో సందేహాల‌కు ఆస్కార‌మే లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp