తాను అనని మాటలను కొందరు తాను అన్న విధంగా రాజకీయంగా గిట్టని వారు తనని తిట్టించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిన్నటి వేళ ఓ వీడియోను వైరల్ చేయడం భావ్యం కాదని అంటున్నారీమె. అంతేకాదు తనకు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ రెండు కళ్లు లాంటి వారు అని కూడా అన్నారామె. తనకే కాదు దళిత వాదానికే ఖ్యాతిని తెచ్చిపెట్టిన వారు వీరని కీర్తిస్తూ నిన్నటి వీడియో విషయమై వితండం కు పోకుండా క్షమాపణలు చెప్పి హుందాతనం చాటుకున్నారు.
వివాదాల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా) అంబేద్కర్ పై తాను చేశానంటూ వైరల్ అవుతు న్న వ్యాఖ్యలపై స్పందించి, క్షమాపణలు చెప్పారు. తాను ఆ విధంగా రాజ్యాంగ నిర్మాత పై వ్యాఖ్యలు చేయలేదని, ఇదంతా సోషల్ మీడియాలో ఎవరో తనపై పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారంలో భాగమేనని అర్థం వచ్చే విధంగా మాట్లాడి వివాదానికి తెరదించేందుకు ప్రయత్నం చేయడం గమనార్హం. తాను మాట్లాడిన విధంగా వస్తున్న వ్యాఖ్యలన్నీ కట్ అండ్ పేస్ట్ టైప్ లో ఎడిటెడ్ వెర్షన్ లో ఉన్నాయని అన్నారామె. పోనీలేండి ఇంత కాలం ఆమె ఎన్నో వివాదాల్లో ఉన్నా ఈ ఒక్క వివాదంలో అయినా కాస్త తగ్గి మాట్లాడి పరువు నిలబెట్టుకున్నారు. తాను మొదట్నుంచి అంబేద్కర్ వాదినేనని, తనకు ఎటువంటి దురుద్దేశాలూ లేవని కూడా చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి