అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి ప్రజాస్వామ్యం పాలన పోయి తాలిబన్ల పాలన రావడానికి కారణం అగ్రరాజ్యమైన అమెరికా అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. 2 దశాబ్దాల క్రితం తాలిబన్లను ఊచకోత కోసి ప్రశాంత పాలనను తీసుకువచ్చింది అమెరికా. కానీ బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించడంతో చివరికి తాలిబాన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆయుధాలు చేతపట్టి అరాచకాలు సృష్టించి ఇంకా ఎన్నో ప్రాణాలు తీసి మళ్ళీ ఆధిపత్యాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు పాలనకు కారణమైన అగ్రరాజ్యమైన అమెరికా ఇప్పుడు కొత్త నాటకానికి తెర లేపుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ నాశనం కావడానికి కారణమైన రష్యా అమెరికాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్ బాగుకోసం సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవైపు ఉక్రెయిన్ విషయంలో పై చేయి సాధించడానికి అమెరికా రష్యా దేశాలు యుద్ధానికి సిద్ధం అనే విధంగానే వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు దేశాలు కూడా నేరుగానే హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. అలాంటి రెండు దేశాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కోసం కలిసి ముందుకు సాగుతాం అంటూ సమావేశం నిర్వహించడం మాత్రం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా రష్యా చైనా పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి ట్రోయిక సమావేశం ఈనెలాఖరులో నిర్వహించి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం గురించి ఆలోచిస్తాము అంటూ ఇటీవల స్టేట్మెంట్ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి