రెండున్నర ఏళ్ళు కాస్త నిదానంగా రాజకీయం చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు దూకుడు పెంచారు. ఈ రెండున్నర ఏళ్ల నుంచి కష్టపడితేనే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవగలుగుతామని బాబుకు అర్ధమైంది. ఇక నుంచి పనిచేయకపోతే దెబ్బతింటామని బాబుకు తెలిసింది...అందుకే ఇంకా దూకుడు పెంచారు. ఓ వైపు అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే మరోవైపు...టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఇప్పటి నుంచి, నెక్స్ట్ ఎన్నికల వరకు బాబు కార్యక్రమాలు ఫిక్స్ చేసేస్తున్నారు.

ఈ ఏడాది అంతా టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లాలని, మీడియాల్లోనే మాట్లాడటం కాకుండా, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడాలని అంటున్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలు రాష్ట్ర స్థాయిలోని సమస్యలపై మాట్లాడారు. ఇకపై లోకల్‌లో వైసీపీ నేతలు చేసే అక్రమాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో సరిగ్గా పోరాడకపోయినా, పనిచేయకపోయినా అలాంటి నాయకులని తప్పిస్తానని అంటున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలని సైడ్ చేసిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో పనిచేయని నాయకులని తప్పించి...కొత్తవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా వైసీపీకి ధీటుగా పనిచేయకపోతే, వారు దండం పెట్టేసి తప్పుకోవచ్చని చెప్పారు.

అయితే ఈ విషయంలో చంద్రబాబు, సీనియర్ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారట. ఏదో సీనియర్లుగా ఉన్నాం కదా..తమ సీట్లు ఎక్కడకుపోవు...నెక్స్ట్ ఎన్నికల ముందు పనిచేయొచ్చని ఫీల్ అవుతున్న సీనియర్లకు బాబు సీక్రెట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో సీనియర్లని సైతం లెక్క చేయమని చెప్పేసారట. పనిచేయకపోతే మాత్రం పక్కన పెట్టేయడం గ్యారెంటీ అన్నారు. అందుకే ఈ మధ్య సీనియర్లు సైతం నియోజకవర్గాల్లో ప్రత్యక్షమయ్యారు. గత ఎన్నికల తర్వాత అడ్రెస్ లేని నాయకులు మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో దిగేసి పనులు చేయడం స్టార్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావు, కే‌ఈ కృష్ణమూర్తి లాంటి నేతలు సైతం యాక్టివ్ అయ్యారు. మొత్తానికి బాబు వార్నింగ్ వర్కౌట్ అవుతున్నట్లు ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: