ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, దేశరాజకీయాలలో తన కంటు ఒక ప్రత్యేక స్థానం ఉన్న సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్. ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన వారసుడుగా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం యుపిలో ఎన్నికల సంగ్రామం జరుగుతున్న నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్  కోడలు బిజేపిలో చేరారు. కారణం ఏమిటి ?
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ జనవరి 19న బీజేపీలో చేరారు. ఆమె ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స బిజేపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు  స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమే ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ పై ప్రశంసల జల్లు కురిపించారు. దేశ ప్రజల ప్రయోజనాలకు మోడీ ఎక్కువ ప్రధాన్యత నిచ్చారని తెలిపారు. పరిశుభ్రత, మహిళా సాధికారత,  ఉపాధి కల్పన  కోసం బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలను ప్రశంసించాల్సిన వని  ఆమె కోనియాడారు.
 ములాయం సింగ్ యాదవ్  మొదటి భార్య కుమారుడు అఖిలేష్ యాద వ్. ప్రస్తుతం ఆయన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. అయితే అపర్ణ యాదవ్ ములాయం సింగ్ రెండవ భార్య కుమారుడు ప్రదీక్ యాదవ్ ను వివాహం చేసుకున్నారు. అపర్ణ యాదవ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. స్వంత పార్టీ నేతలు వెన్నుపోటు పెడవటం ద్వారా తాను ఓటమి పాలయ్యానని ఆమె అప్పడే సమాజ్ వాదీ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.
అపర్ణ యాదవ్ సమాజ్ వాదీ పార్టీని వీడుతారని చాలా కాలంగా దేశ రాజకీయాలలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటిని సమాజ్ వాదీ శ్రేణులు ఎప్పటికప్పుడు కొట్టి పారేశాయి. ఇటీవల బిజేపి కి చెందిన రాష్ట్ర మంత్రులు కొందరు కమలానికి గుడ్బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అందుకు ప్రతిగా భారతీయ జనతా పార్టీ కూడా అపర్ణ యాదవ్ కు  కాషాయం కండువా కప్పి రిటన్ గిఫ్ట్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం అని ఎన్నికల సర్వేలు చెబుతున్న వేళ అరప్ణ యాదవ్ చర్య వివేక వంతమైనదిగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: