ఏపీలో జగన్ వచ్చాక ఉద్యోగాలే ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. జగన్ సీఎం అయ్యాక గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని కోసం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా భారీగా నియామకాలు చేశారు. అలా మొత్తానికి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 3 లక్షల వరకూ ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్పకుంటారు. అయితే అలాంటి జగన్ ఇప్పుడు నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.


త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించిన జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులును వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థాయిలో సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ కీలకం అన్న సీఎం జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.


గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ విభాగాల మధ్య సరైన సమన్వయం ఉండాలని సూచించిన జగన్... లంచం అడిగితే ఫిర్యాదు చేసేందుకు తగిన వ్యవస్థ ఉండాలని సూచించారు. ఏపీలో ఆధార్‌ సేవల కోసం సాంకేతిక పరికరాల కొనుగోలుకు కూడా సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. మే నాటికి ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించిన సీఎం జగన్.. ఉత్తమ సేవలందించే వాలంటీర్లకు ఉగాదికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.


గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనపై తనదైన ముద్ర వేసిన జగన్.. ఇప్పుడు దాన్ని మరింత సుస్థిరం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలను సక్రమంగా అందిస్తే.. గ్రామాల సమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయని.. ప్రజామోదం పొందవచ్చని జగన్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: