రాజ్యంలో కొన్ని మాత్రమే ఉంటాయి ఉండాలి కూడా!
ఇప్పుడు గన్ పార్క్ వద్దు అమరుడి స్థూపం వద్దు
ఇప్పుడు అడవి వద్దు అడవి మల్లెలూ వద్దు
నెత్తుటి గీతలూ వద్దు చారలూ వద్దు
ఏవీ వద్దు ఏదయినా మీ జీవిత ఇతివృత్తం దోష రహితం
అని నమ్ముకుంటూ వెళ్తాం.. చివర్లో వెళ్లి వస్తాం ఎక్కడో ఒక దగ్గరకు
కోటినొక్క దేవుళ్లకు..వారి సలహాదారులకు మరియు దేవేరులకు మరియు పరిచారికలకు అభిసారికలకు వందనాలు చెల్లించి రావాలి.ఆకలి కేకల మధ్య పుట్టిన పాటకు,ఆవేదన మాత్రమే వినిపించిన పాటకు,అమరత్వం వినిపించి అద్వైత సిద్ధిని కలిగించినందుకు విశిష్టాద్వైత నీడల్లో పాడుతూ ఆ పాదాల దగ్గర మరో పాదం. విఠలరావు అనే పాదం..ఆడుతోంది.పాడుతోంది. కమ్యూనిస్టు శక్తులకు అడవికి మధ్య నలిగిపోయినప్పుడు ఇవన్నీ ఏమయినాయి అన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది.వినవస్తోంది.కవి రాజా! నీకు వందనాలు.. నీ రాజసానికి నీ రాజనీతిజ్ఞతకు వందనాలు.
నిచ్చెన మెట్లు ఏమయినాయో తెలియదు.ఒక బలీయమైన వకీలు పాట ఒకటి పాడి దేవుడి దగ్గర వినమ్ర పూర్వక వందనం చేయడం తప్పు కాదు కానీ నా దృష్టిలో మాత్రం అంగీకారం కాదు. అంగీకారం కానివేవో నువ్వు వినిపిస్తూ ఇది నా పాట ఇప్పుడు దారి మార్చినా..కేసీఆర్ పై కూడా పాట కడుతున్నాను.ఇప్పుడు నాకు ఇంటి స్థలం కావాలె..ఇప్పుడు నాకు వృద్ధాప్య పింఛను కావలె..ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ పదవి కావలె అని కోరుకుంటున్నవు కదా! కనుక ఆ అభిష్టం సిద్ధించేందుకు పాలకులకు అనుగుణంగా మారిపోతూ మారిపోతూ ఆ పొడుస్తున్న పొద్దుకు నడుస్తున్న కాలానికి కత్తుల కోలాటానికి నెత్తుటి ఆరాటానికి క్షమాపణలు చెప్పి పో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి