జగనొస్తే జాబ్ వస్తుందని ఆ రోజు ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు జగన్ వచ్చినా కూడా ఎక్కడా జాబులు లేవు అని గగ్గోలు పెడుతున్నారు నిరుద్యోగులు.పాపం! వీళ్లంతా రెండు లక్షల 30 వేల ఉద్యోగ భర్తీ కోసం వేచి చూస్తున్నారు.ఈ రోజు ఇదే ప్రధాన డిమాండ్ తో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) రోడ్డెక్కింది.కలెక్టరేట్ల ముట్టడికి ప్లాన్ చేసింది. కానీ ధర్నాను భగ్నం చేశారు పోలీసులు.వీరిని సమీప స్టేషన్లకు తరలించి నిర్బంధించి తరువాత వదిలేశారు.కొందరిని మార్గ మధ్యలోనే నిలివేశారు. ఆ రోజు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం అండగా ఉంటానని చెప్పారు.చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని కూడా అన్నారు.తాను అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామనీ అన్నారు.
కానీ ఇప్పుడు అవేవీ కాకుండా పోయాయి.రాష్ట్రంలో కొత్త కొలువుల సందడి లేనేలేదు.సచివాలయ ఉద్యోగాలు మినహా రెగ్యులర్ పోస్టులు తీసిందీ లేదు..ఖాళీలను భర్తీ చేసింది లేదు.దీంతో చాలా మంది నిరుద్యోగులు ఆశలన్నీ వదులుకుని, నోటిఫికేషన్లు ఇక రావని తేలాక వలసలు వెళ్తున్నారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇవాళ ఇదే విధంగా చాలా మంది ఊళ్లు దాటి పోతున్నారు. గల్ఫ్ దేశాలను ఆశ్రయించి దుర్భరావస్థల మధ్య ఉద్యోగాలు చేస్తున్నారు. మరి!జగన్ ఇచ్చిన డిమాండ్ ఏమయింది.పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా వేయని లేదా వేయలేని స్థితిలో ఓ గవర్నమెంట్ ఉంటే నిరుద్యోగులు నిలదీయక ఏం చేస్తారు? అరె! బాబూ జగన్ జర శోచోరే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి