ఇక అక్కడ ఫుడ్ అనేది ఈవెంట్ జరుగుతోంది. భోజనంతో పాటు మంచి మంచి బహుమతులు కూడా అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఇంకేం జనాలు బాగా పోటెత్తారు.తిండి ఇంకా అలాగే గిఫ్టుల కోసం వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు. దీంతో తొక్కిసలాట అనేది అక్కడ జరిగింది. అందులో 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు అయితే చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇక చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే. మంచి భోజనం దొరుకుతుందని ఆశపడి వచ్చిన పిల్లలు ఆ తొక్కిసలాటలో చిక్కుకుని విగతజీవులుగా మారిపోయారు. ఇక ఈ విషాద ఘటన నైజీరియాలోని ఓ చర్చీలో జరిగింది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ పట్టణంలోని ఓ చర్చ్ స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం గాను భారీగా ప్రచారం చేశారు. ఆహారంతో పాటు మంచి గిఫ్టులు కూడా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో చర్చీ దగ్గరకు జనాలు చాలా భారీగా తరలివచ్చారు. ఫుడ్ ఇంకా గిఫ్టులు తీసుకునేందుకు వారు క్యూలో నిలబడ్డారు. అయితే డొనేషన్ డ్రైవ్ నిర్వహకుల అంచనా కంటే కూడా భారీగా ప్రజలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణి చాలా కష్టంగా మారింది.



ఇక అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు బాగా అసహనానికి లోనయ్యారు. తమ వంతు దాకా వస్తుందా రాదా అన్న ఆందోళనతో.. వారు ఒక్కసారిగా ముందుకు ఎగబడ్డారు.ఇక జనం ఒక్కసారిగా ముందుకు వచ్చారు. చాలా మంది కూడా గేట్లు పగలగొట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో క్యూలెన్లలో తొక్కిసలాట బాగా జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 31 మంది స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. ఇక గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు.. అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఈ తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణి ప్రారంభం కాలేదని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె చెప్పారు. గేటు మూసి ఉన్నా లోపలికి వెళ్లేందుకు జనాలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుని చేస్తున్నారు. సరైన వసతులు అనేవి లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైన కూడా వారు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: