మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా స్టార్ చిరంజీవి ఆ మధ్య ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడే సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇపుడేమో జనసేన పార్టీతో పాలిటిక్స్ లో బిజీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక నాగబాబు అయితే బుల్లి తెరపై జడ్జిగా వ్యవహరిస్తుండగా ఇపుడు తమ్ముడు పార్టీ జనసేన ద్వారా రాజకీయాల్లో ఊపందుకుని ఎంపి గా గెలవాలని ట్రై చేస్తున్నారు. గతంలో కూడా గట్టిగానే ప్రయత్నించారు కానీ వైసీపీ ముందు ఓటమి తప్పలేదు. నాగబాబు కు అన్న చిరు అంటే ఎనలేని గౌరవం, తమ్ముడు కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ. అందుకే ఇపుడు తన తమ్ముడు పార్టీకి అండగా నిలబడ్డాడు నాగబాబు.

ఒకవైపు అండగా ఉంటూనే ఎంపిగా అవ్వాలనే తన ఆకాంక్షను కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట నాగబాబు.  ప్రస్తుతం ఏపిలో  జనసేన పార్టీ కూడా చాలా బలంగా తయారయింది. జనసేనను వదులుకోకూడదు , టిడిపి వైపు మొగ్గనివ్వకూడదు అని  బిజెపి, జనసేనతో పొత్తు ప్రదానం అని టిడిపి రెండు పోటాపోటీగా జనసేన పార్టీ వైపు చూస్తుంటే ఇదే టైం లో మరింత బలంగా మారింది జనసేన. ఈ బలానికి తోడు ప్రజల మద్దతు కూడా పెరిగితే అధికారం అనతి కాలంలోనే సాధ్యమని భావిస్తూ పావులు కదుపుతోంది.  ఈ క్రమంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు జనసేన నేతలు. ఈ మధ్య పవన్ కూడా పలు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు టార్గెట్ చేశారు . జూన్ 1 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర కు ఇన్చార్జిగా జనసేన తరఫున నాగబాబు ను  నియమించగా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకోవాలి అని నాగబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈసారి ఉత్తరాంధ్ర నుండి పోటీ చేసి ఎలాగయినా విజయం అందుకోవాలని, ఎంపిగా అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ కనుక చేస్తే తప్పక విజయం అందుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని పార్టీల నుండి వ్యూహాలు భారీగా ఉన్నా.. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఎవరు ఊహించలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: