కొద్దిరోజులుగా తెలంగాణా రాజకీయాల్లో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ముచ్చట చెప్పుకోని రోజులేదు. పార్టీపెట్టి దాదాపు ఏడాది దాటిని ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీక్షలు చేసినా, పాదయాత్రలు చేసినా రాజకీయపార్టీలు కాదుకదా చివరకు జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇక లాభంలేదనుకుని మంత్రులు, టీఆర్ఎస్ ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలు, అక్రమాలంటు గోల మొదలుపెట్టారు. దాంతో మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలు షర్మిలను గట్టిగా తగులుకోవటం మొదలుపెట్టారు.





షర్మిలకు వ్యతిరేకంగా స్పీకర్ కు ఫిర్యాదుచేశారు, ఆమె ప్రయాణించే వాహనంపై దాడులుచేశారు. కేసీయార్ ఉండే ప్రగతిభవన్ కు ఆమె వెళ్ళే వాహనాన్ని పోలీసులు టాయింగ్ వాహనంతో లేపి నేరుగా పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళటంతో ఒక్కసారిగా జాతీయ వార్తల్లోకి ఎక్కేసింది షర్మిల. ఇదంతా షర్మిల కావాలనే చేస్తున్నారా లేకపోతే పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల జరిగిందా అన్నది పక్కనపెట్టేస్తే షర్మిలయితే వార్తల్లో వ్యక్తయిపోయారు. తనకున్న పరిమిత వనరులతో షర్మిల గట్టిగానే పోరాడుతున్నారు.





ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఎంతసేపు ట్విట్టర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడైనా సభల్లో పాల్గొంటే జనాలకు అర్ధంకాని రీతిలో పూనకం వచ్చినట్లు ఊగిపోతు ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టేస్తుంటారు. అంతేకానీ జనాలను తనవైపు ఎట్రాక్టు చేయటానికి కన్సట్రక్టివ్ గా ఇంతవరకు ఒక్క  ప్రోగ్రామ్ అన్నా చేశారా ? నిజానికి పవన్ రోడ్డుమీదకు వస్తే అభిమానులే వేలల్లో గుడిగూడుతారు. ప్రత్యేకించి జనసమీకరణే చేయాల్సిన అవసరంలేదు.





కానీ షర్మిల పరిస్ధితి అదికాదు. పార్టీ ఉనికి చాటుకోవటానికే నానా అవస్తలు పడుతున్నారు. షర్మిల పోరాటాన్ని చూసైనా పవన్ కాస్త ఆలోచించుకోవాలి కదా. ఏరకంగా చూసుకున్నా పవన్ కన్నా షర్మిలే బెటర్ అనిపించుకుంటున్నారు.  జనాల్లో గుర్తింపుకోసం పార్టీ అధినేతగా షర్మిల చేస్తున్న పోరాటం ముందు పవన్ అసలు నిలబడగలరా ? పవన్ చేస్తున్న పోరాటం ఏముంది ? పైగా తెలంగాణాలోని 32 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల-పవన్ మధ్యే పోటీ ఉంటుందేమో ?






మరింత సమాచారం తెలుసుకోండి: