
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధపై వైసీపీ నుండి పడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు మాత్రమే కాకుండా, మరో రెండు ఓట్లు వైసీపీ నుండి పదం మూలంగానే అనురాధ గెలిచింది. అందువలనే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గురువులు ఓటమి పాలయ్యాడు. నిజంగా ఈ ఓటమి వైసీపీకి తల తీసేంత పని చేస్తోంది అని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ నాయకులు అంతా కూడా ఈ ఓటమికి కారణం అయిన కట్టప్పలు ఎవరు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. సొంత ఎమ్మెల్యేలు కూడు పెట్టిన పార్టీకి ద్రోహం చేయడమా అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పుడు సమస్య అంతా వైసీపీ సొంత ఇంటిలోనే ఉందంటూ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇంటి దొంగను పట్టుకుంటే కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధ్యం కాదన్న విషయాన్ని ఈ ఓటమి ఖరారు చేసింది. మరి వైసీపీ అధినేత మరియు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఎటువంటి ప్రణాలికను చేసి వైసీపీలో ఉన్న కట్టప్పలను కనిపెట్టి పార్టీలో వారికి ప్రక్షాళన చేస్తాడన్నది చూడాలి. నిజంగా ఇది జగన్ కు సవాలు లాంటి గట్టి సమస్య అని చెప్పాలి .