రెండు నిజాల మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరుక్కుపోయినట్లున్నారు. అందుకనే ఆ రెండు నిజాలను ఖండించటం చేతకాక నోరిప్పలేకపోతున్నారు. ఒకవైపు మిత్రపక్షం బీజేపీ నేతలు డైరెక్టుగా తనపైన ఆరోపణలు చేసినా పవన్ సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు తన ఆరాధ్య దైవం చంద్రబాబునాయుడు అనైతికంగా వైసీపీ ఓట్లు వేయించుకున్నారు. ఇది అందరి కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే దాన్నీ ఖండించలేక నానా అవస్తలు పడుతున్నారు.





బహుశా చంద్రబాబు చేసిన అనైతిక వ్యవహారం పవన్ కు లోలోపల బాగా సంతోషంగానే ఉండుంటుంది. కానీ తెల్లవారి లేచిన దగ్గర నుండి పవన్ నోటివెంట నీతి, నిజాయితి, ధైర్యం, చిత్తశుద్ది, కమిట్మెంట్ లాంటి పదాలే వినిపిస్తుంటాయి. పవన్ వినిపించే మాటలకు చంద్రబాబు అనైతిక విధానాలకు ఏమాత్రం పొంతనుండదు. అయినా సరే పవన్ కు చంద్రబాబు అంటే విపరీతమైన ఆరాధన. ఈ ఆరాధననే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్యాకేజీ అంటున్నారు.





ఎంఎల్సీ ఎన్నికల్లో తమకు ఓట్లేయమని చెప్పకుండా పవన్ మోసంచేశారంటు బీజేపీ నేతలు డైరెక్టుగానే మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పింది నిజం కాబట్టే పవన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పిన విషయం తెలిసిందే. వైసీపీకి ఓట్లు వేయద్దని చెప్పారే కానీ పొరబాటున కూడా మిత్రపక్షం అభ్యర్ధికి ఓట్లేసి గెలిపించమని పవన్ చెప్పలేదు.





దీన్ని పవన్ కూడా ఇపుడు సమర్ధించుకునే అవకాశంలేదు. అందుకనే మిత్రపక్షం చేసిన ఆరోపణలు తనగురించి కాదన్నట్లు తుడిచేసుకున్నారు. అలాగే వైసీపీ ఓట్లను చంద్రబాబు అనైతిక చర్యల ద్వారా లాక్కున్న విషయం స్పష్టంగా బయటపడింది. అయినా చంద్రబాబు చేసింది తప్పని పవన్ ఖండించలేకపోతున్నారు. అంటే పవన్ పైకి చెప్పే నీతి, నిజాయితి అనేది కేవలం పెదవి పై మాట మాత్రమే అని అర్ధమవుతోంది. ఇటు బీజేపీ నేతలు చెప్పింది అటు చంద్రబాబు చేసిందానిపై  పవన్ ఎప్పుడు మాట్లాడుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: