వైజాగ్ లోని నోవాటెల్ నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రుషికొండ సందర్శనకు బయల్దేరడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులని ఇచ్చారు.పవన్ కళ్యాణ్ కారుతో పాటు మరో ఏడు కార్లను కూడా పోలీసులు అనుమతించారు. నోవాటెల్ నుంచి రుషికొండకు మొత్తం 10 కిలోమీటర్ల దూరం ఉండగా.. జనసేన కార్యకర్తలు ఇంకా అభిమానులతో కలిసి ర్యాలీగా రుషికొండకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న మార్గంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక జోడుగుళ్లపాలెం దగ్గర పోలీసులు భారీగా పోలీసులు మొహరించారు. రుషికొండను రోడ్డు మీద నుంచి చూసేందుకు పవన్‌ కళ్యాణ్ కు అనుమతులు ఇవ్వగా.. ఆయన రోడ్డు మీద నుంచి చూస్తారా.? లేక పైకి వెళ్తారా.? అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది.ఇక నిన్న జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.


పోలీసుల నోటీసుల్లో మొత్తం 3 సూచనలతో పాటు మరో 3 అదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని పోలీసులు ఆ నోటీసులో ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం విశాఖపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా నోవాటెల్ హోటల్ దగ్గర కూడా హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ కారును ర్యాలీగా ఫాలో అవుతున్నారు జనసేన కార్యకర్తలు, అభిమానులు.అసలు ఇంతకీ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి విశాఖ పోలీసులు ఇచ్చిన నోటీస్‌ల్లో ఏముందంటే.. వారాహి యాత్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యొద్దని, నిరాధార ఆరోపణలు చెయ్యొద్దని ఇంకా వర్గవిభేదాలు సృష్టించే వ్యాఖ్యలొద్దని సూచించారు. ఇంకా అలాగే జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ షెడ్యూల్ కూడా ముందుగానే చెప్పాలని, శాంతికి విఘాతం కలిగించబోమని హామీ ఇవ్వాలని ఖచ్చితంగా పోలీసు నిబంధనలు ఫాలో అవ్వాలని విశాఖ పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: