
దీనిని రాష్ట్రపతి కార్యాలయం ప్రభుత్వానికి ఫార్వార్డ్ చేస్తూ సీఎస్ కు తగిన చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించిన నివేదిక పంపించండి అని కోరింది. సాధారణంగా రాష్ట్రపతి జోక్యం చేసుకున్న అంశం వార్తా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. దీనిపై అడ్వకేట్ జనరల్ దీనిపై కేసు కూడా వేశారు. కానీ ఎల్లో మీడియాలో మాత్రం ఈ వార్త అసలు లేనే లేదు. జగన్ కు సంబంధించిన బ్లూ మీడియాలో రాశారు కానీ మిగతా పత్రికల్లో వార్త ప్రచురితం కాలేదు.
ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ లోక్ సభ, రాజ్య సభ సభ్యులతో కలిసి రాష్ట్రపతిని కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. రాజకీయంగా వేధిస్తున్నారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి అని కోరి వినతి పత్రం అందించారు. దానికి ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించారు. జగన్ అయితే అక్రమ ఆస్తుల కేసు.. చంద్రబాబు అయితే అక్రమ అరెస్టు. బ్లూ మీడియాలో అయితే వైసీపీ అనుకూల వార్తలు. రాతలు. దీనిబట్టి ఏపీలో మీడియా రాజకీయాలను ఎలా వక్రీకరించి చూపుతోంది అని చెప్పడానికి నిదర్శనం చంద్రబాబు అరెస్టు.