నిజానికి హరీ రామ జోగయ్యకు జనసేన మీద అసలు ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే.. ఇది సరైన విధానం కాదంటూ కాపు నేతలు సైతం తెలియజేస్తున్నారు. తను ఏదైనా డైరెక్టుగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కే చెప్పవచ్చని అది ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందంటూ తెలిపారు. అంతే తప్ప ఇలా లేఖలను విడుదల చేసి పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా చాలా ఇబ్బంది పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి
ఒకవేళ హరి రామ జోగయ్య గారు చెప్పినట్టుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వకపోతే ఆయన సూచించిన స్థానాలను కేటాయించకపోయిన కాపు నేతలు కూడా కాస్త ఆలోచనలో పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా టిడిపికి సహకరించేందుకు ఖచ్చితంగా వెనుకాడతారని చెప్పవచ్చు.. జనసేన ఓట్లు టిడిపికి కూడా పడకపోవచ్చు ఇలా ఎన్నో నష్టాలు జరుగుతాయని హరి రామ జోగయ్య గారికి తెలియదా అంటూ తెలుపుతున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టే దానికి చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జోగయ్య గారు ఆరు పార్లమెంటు స్థానాలు 41 అసెంబ్లీ స్థానాలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. మరి ఈ విషయం ఎందకా వెళ్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి