దీంతో అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల సైతం ఆయన పైన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల అధికారితో సైతం వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటు టిడిపి వైసిపి నాయకులు అక్కడ చేరుకోవడంతో ఈ ఉధృత మరింత నెలకొంది.. దీంతో అక్కడ నేతలు సైతం ఈవీఎంలను వెంటనే తొలగించాలని దీని స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ ను కూడా చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే హుటాహుటిగా సంఘటన స్థలానికి సిఐ వెంకటరామిరెడ్డి చేరుకొని ఇరువురు పార్టీలను సైతం చెదరగొట్టి పంపించేశారు..
అయితే ఓటింగ్ వేసే సమయానికి తెరిచిన ఈ ఈవీఎం స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తామని సిఐ వెంకట్రామిరెడ్డి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి నాయకులు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.. అయితే ఓటింగ్ కి మరో కొన్ని గంటల సమయం ఉన్నప్పుడే.. ఇలాంటి సంఘటన జరగడంతో మరి ఓటింగ్ పూర్తి అయ్యేసరికి ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకుంటుందో అంటూ పలువురు ఓటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.. ఈసారి ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి. అటు టిడిపి వైసిపి పార్టీ మధ్య ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. మరి ఓటింగ్ శాతం ఎంత వస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి