ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ నాయకుడు పాలించినా అది ప్రజాభివృద్ధి కోసమే చేయాలనేది జగమెరిగిన సత్యం. కానీ అభివృద్ధిని అడ్డుకోవడం, నాయకులకు అడ్డు చెప్పడం ఏపీలో ప్రతిపక్ష పార్టీ టిడిపి చేస్తున్న పని. ప్రజలకు మేలు కలిగే ఏ పనైనా సరే వారు అడ్డకాలు వేసి మరీ ఆపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అంటూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ముందుకెళ్లారు. దీన్ని తట్టుకోలేనటువంటి టిడిపి ప్రభుత్వం జగన్ కు ఎక్కడ సింపతి పెరుగుతుందో అని మూడు రాజధానుల అంశాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అమరావతి ఒక్కటి రాజధానిగా ఉంటే చాలని,  ఏపీకి ఇన్ని రాజధానులు అవసరం లేదని టిడిపి అంటూ వస్తోంది. 

అయితే టిడిపిలో మరికొంతమంది నేతలేమో  మూడు రాజధానుల అంశాన్ని ఓకే అని ఒప్పుకున్నా కానీ పైకి నవ్వులు లోపల కత్తులు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. మరి మూడు రాజధానుల వల్ల ఎవరికి లాభం అనే వివరాలు చూద్దాం. అభివృద్ధి పరంగా చూసుకుంటే మూడు రాజధానులు ఎంతో మేలని జగన్ భావించారు. ముఖ్యంగా ఏపీలో రాయలసీమ,మధ్యాంధ్ర,ఉత్తరాంధ్ర  మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం,నేలల స్వభావం,భౌగోళిక పరిస్థితుల  తీరు అనేది మూడు ప్రాంతాల్లో మూడు విధాలుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్  మూడు రాజధానులు చేయాలనే అంశాన్ని ప్రతిపాదించారు. ఇందులో ముఖ్యంగా శాసన రాజధానిగా మధ్యాంధ్రలో ఉన్న అమరావతి ని కొనసాగించాలనుకున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ను  ఏర్పాటుచేసి హైకోర్టు అక్కడ  నిర్మించాలని భావించారు.  

ఇక రాష్ట్రంలోని మరో పెద్ద నగరమైన విశాఖపట్నం పరిపాలన కేంద్ర రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని ని దగ్గర చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లారు.  ఈ విధమైన ఆలోచన ఇప్పటికే చత్తీస్గడ్, కేరళ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని  ఈ అంశాన్ని ప్రతిపాదించడంతో  ప్రతిపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ విధంగా మూడు ప్లేసుల్లో మూడు రాజధానులు ఉండడం వల్ల ప్రజలు ఆర్థికపరంగా కానీ సామాజికపరంగా కానీ  అభివృద్ధి చెందుతారు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. దీనికి మొదట్లో టిడిపి ప్రభుత్వం అడ్డ చెప్పినప్పటికీ కూటమిగా ఏర్పడిన తర్వాత కాస్త అంగీకరిస్తూ వస్తోంది. మరి మూడు రాజధానులు మనకు ఏర్పాటు కావాలంటే తప్పనిసరిగా మనం మళ్ళీ జగనన్నకే ఓటు వేయాలి. జగన్ ప్రభుత్వం వస్తేనే మూడు రాజధానులు అనేవి ఏర్పాటవుతాయనే విషయాన్ని ప్రజలు మరవద్దు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: