గత కొన్ని వారాలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న నరమేధం ఆపాలని భిన్న జాతులు, మతాలు, దేశాల విద్యార్థులు, భారతీయ సంతతి విద్యార్థులతో సహా అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో తీవ్ర నిరసనలు జరుపుతున్నారు. దాదాపు 120కి పైగా యూనివర్శిటీల్లో టెంట్లు వేసుకొని తమ విశ్వవిద్యాలయాలు పాలక మండళ్లు ఇజ్రాయెల్ కి చెందిన లేక సంబంధమున్న కంపెనీలో పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని.. ఆయా లాభాలని వాడుకోవడం అంటే అది జరుపుతున్న నరమేథంలో పాలు పంచుకోవడమేనని వాదిస్తున్నారు.


ఇవే నిరసనలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లో కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా, ఐరాపా, ఆసియా దేశాల వీధుల్లో కొన్ని నెలలుగా జరుగుతున్న సంఘటలనకు ఇవి కొనసాగింపు. ఈ నిరసనల ప్రధాన అంశం ఇజ్రాయెల్ కు జయోనిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యూదులు పోషిస్తున్న కీలక పాత్ర.


అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు దాడులు చేశారు. అత్యంత పాశవికంగా దాడులు చేసి కొంతమందినీ బంధీలుగా పట్టుకొని వెళ్లారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులు తల దాచుకుంటున్న పాలస్తీనాపై వార్ ప్రకటించింది. ఈ దేశానికి అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్ లు కూడా మద్దతు తెలిపి ఆయుధ సామగ్రిని అందజేశాయి. దీంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో అమాయకులైన పాలస్తీనా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అనేక మంది క్షత గాత్రులవుతున్నారు. తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తోంది.


ఈ దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే వీరంతా హమాస్ కి మద్దతు పలకడం లేదు. ఈ విధంగా జరిగినా వారు చేసిన దాడి ఆమోదయోగ్యం కాదు.  ఈ విషయాన్ని అంతా మరిచిపోతున్నారు.  వీరు కేవలం అమాయక ప్రజలైన పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవద్దని మాత్రమే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఇజ్రాయెల్, అంతకు మించి శక్తి మంతమైన అమెరికాతో కలిసి బలహీన దేశమైన పాలస్తీనాపై దాడి చేస్తోంది. హమాస్ తీవ్రవాదుల ముసుగులో సుమారు 32 వేల మంది ప్రజల ప్రాణాలు తీశారు. హమాస్ తీవ్రవాదులు లేని చోట్ల కూడా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. వీటిని వెంటనే ఆపాలంటూ యూనివర్శిటీ విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa