![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/jagan-268f40ea-495f-4811-9e07-95cb8616c0dd-415x250.jpg)
ఈ క్రమంలోనే మరొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ప్రమాణ స్వీకారం నాటి ఈవెంట్ నిర్వహించడానికి ఒక కమిటీ ఏర్పాటు అయిందట. ఆ కమిటీకి ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఛైర్మన్ అని అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ అనే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు కాబోతోందని ప్రస్తుతం వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఉదయం పూట జగన్ ప్రమాణస్వీకారం జరగని ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ ఒక దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన టిఫిన్లను, భోజనాలను వడ్డించాలని వైసీపీ నిర్ణయించిందట.
వారి ప్రకారం బ్రేక్ ఫాస్ట్ లో మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగు వడ, సాంబార్ వడ, మసాలా వడ, చక్కెర పొంగలి, పోహా వేపుడు, పాయసం, చాక్లెట్ దోశ, బొబ్బట్లు, ఆంధ్ర స్వీట్లు, పునుగులు ఉండనున్నాయట. ఇక నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ పెసరట్టు, ఎగ్ దోశ, చికెన్ దోశ , మటన్ పెసరట్టు, మటన్ కీమా, ఎగ్ భర్పి, అరిసెలు, బోటి వడ నాటుకోడి పులుసు, ఉప్మా ఇడ్లీ, చికెన్ పొంగల్, పెసర పునుగులు, మద్రాసు ఫిల్టర్ కాఫీ, ఫ్రెష్లీ స్కీజ్డ్ ఆరంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఉన్నాయట.
లంచ్ లో గోంగూర అన్నం, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటేబుల్ బిర్యానీ, టమాట పప్పు, ఉలవచారు, గుత్తొంకాయ కూర, ఆంధ్ర ఆవకాయ, దొండకాయ ఫ్రై, ఆలు కుర్మా సాంబారు రైస్, కర్డ్ రైస్, పూతరేకులు, బూందీ లడ్డు కూడా పెట్టనున్నారట. ఇక మాంసాహార ప్రియుల కోసం మటన్ పులావు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, నాటుకోడి వేపుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతం లేనట్లే ఉంది. ఏదైనా ఒకవేళ గెలిస్తే జగన్ తన వైపు నుంచి మంచి విందు భోజనాన్ని ప్రజలకు ఇంకా నేతలకు కార్యకర్తలు అందరికీ వడ్డించబోతున్నారని తెలుస్తోంది.