ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలిస్తే అమరావతి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికలకు ముందే ప్రచారంలో భాగంగా చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసింది.. ఇక ఆ తరుణం రానే వచ్చింది.. ఈరోజు గుంటూరు జిల్లాలో కేశేపల్లిలో ఏర్పాటుచేసిన 12 ఎకరాల ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా ప్రారంభమయ్యింది.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రమాణం మొదలుపెట్టగానే ప్రజలు కేరింతలతో హోరెత్తించారు.

గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు ఈ మాట అనడం కోసం టిడిపి శ్రేణులు ఎంతగానో ఎదురు చూసాయి.. ఇక ఆ తరుణం రావడంతో ప్రాంగణమంతా చప్పట్లు , ఈలలతో హోరెత్తించారు.. ముఖ్యంగా అభిమానుల సందడికి అవధులు లేవనే చెప్పాలి ఇకపోతే ఈ చంద్రబాబు ప్రమాణస్వీకార ఉత్సవానికి సినీ గ్లామర్ కూడా జోడింపబడింది.ప్రముఖులు కేంద్ర మంత్రులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు..

ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సెలబ్రిటీలు విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా , జేపీ నడ్డా , నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి,  మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.. వీరితోపాటు చిరంజీవి ఆయన భార్య సురేఖ సతీసమేతంగా హాజరు కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విచ్చేశారు.. ఆయన కూడా ఆయన భార్య తో రావడం గమనార్హం.. ఇక వీరితో పాటు వెంకయ్య నాయుడు బాల కృష్ణ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే , పన్నీర్ సెల్వం, ఎన్వి రమణ,  ప్రఫుల్ పటేల్ , చిరాగ్ పాశ్వాన్ ఈ ప్రధాన వేదిక పైన ఆసీనులయ్యారు. ఇక ఎన్టీఆర్,  చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్నారు. మొత్తానికి అయితే ఈ ప్రాంగణం అటు రాజకీయ నేతలు,  ఇటు సినీ గ్లామర్ తో చాలా అందంగా ముస్తాబయిందనే చెప్పాలి.. మొత్తానికి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే నాటి ఎన్టీఆర్ హయాంలో జరిగిన వేడుకలను తలపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: