ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం 11 మంది కాగా ఈ ఎమ్మెల్యేలలో కొందరు ఎమ్మెల్యేలు బాబు అనుమతి ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వైసీపీని నిర్వీర్యం చేసే ఆలోచన మాత్రం బాబుకు లేదని సమాచారం అందుతోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే టీడీపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.
 
ప్రజల్లో వ్యతిరేకత రాకుండా బాబు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ తప్పు చేసినా ఎంత ఘోరమైన ఫలితాలు వస్తాయో వైసీపీకి వచ్చిన ఫలితాలతో బాబుకు అర్థమైంది. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత బాబుపై అయితే ఉంది. బాబు కూటమిలోకి గేట్లు క్లోజ్ చేశాడుగా అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
 
చంద్రబాబు నాయుడు పొలిటికల్ ప్లాన్స్ ఒకింత భారీ స్థాయిలోనే ఉన్నాయని జగన్ ను మించి సంక్షేమం చేయాలని చంద్రబాబు గట్టిగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అమరావతి అభివృద్ధి కోసం బాబు ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. కేంద్రంలో మోదీ మద్దతు ఉండటం కూడా బాబుకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది.
 
మోదీ సైతం ఒకింత ఎక్కువ మొత్తంలో ఏపీకి నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ గా సైతం అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే పొలిటికల్ గా మాత్రం ఎప్పుడూ ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబు, పవన్ కలిస్తే పొలిటికల్ గా మాత్రం మ్యాజిక్ వర్కౌట్ అవుతోందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: