ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 మెడికల్ కాలేజీలలోని 16 కాలేజీలలో తీవ్రమైన ప్రొఫెసర్ల కొరత ఉందని కూడా ఎన్‌ఎంసీ గుర్తించింది. ఈ సమస్యను త్వరితగతిన సాల్వ్ చేయాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించింది. మొదటిసారి తప్పు జరిగింది కాబట్టి పెనాల్టీ లతో వదిలేస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఈ సమస్యను సాల్వ్ చేయలేకపోతే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తగ్గిస్తామని, లేదంటే కాలేజీల లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది.
విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీల్లో కూడా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఎన్‌ఎంసీ గుర్తించింది. గత ప్రభుత్వం ఐదు ఆరు మెడికల్ కాలేజీ లను స్థాపించింది. అయితే వీటిలోని 20 విభాగాల్లో 15 విభాగాలు ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయని తెలుసుకున్నారు. తర్వాత ఎన్‌ఎంసీ ఈ కాలేజీలకు కూడా మూడు లక్షల జరిమానా విధించింది. దాంతో మొత్తం 16 మెడికల్ కాలేజీలకు 55 లక్షల పెనాల్టీ విధించినట్లు అయింది.