దువ్వాడ శ్రీనివాస్ తో ఏదో రిలేషన్ ఉందని ప్రచారం చేస్తున్నారని అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదని దివ్వెల మాధురి పేర్కొన్నారు. నన్ను వాణిగారు పార్టీలోకి పిలిచారని ఆమె చెప్పుకొచ్చారు. నన్ను మహిళా అధ్యక్షురాలిగా జాయిన్ కావాలని కోరిందే వాణిగారు అని దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ మెచ్య్యూర్డ్ పర్సన్ అని ఆయనకు అన్నీ తెలుసని మాధురి కామెంట్లు చేయడం గమనార్హం.
వీణాగారు టికెట్ కోసం ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని మాధురి పేర్కొన్నారు. నేను, శ్రీనివాస్ మంచి ఫ్రెండ్స్ అని భవిష్యత్తులో మా రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పలేనని ఆమె చెప్పుకొచ్చారు. వీణాగారు అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదని మాధురి వెల్లడించారు. ప్రస్తుతం శ్రీనివాస్ గారితో ఉంటున్నానని భవిష్యత్తులో ఏమవుతుందో తెలియాలని మాధురి పేర్కొన్నారు. మా బంధం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె వెల్లడించారు.
అయితే మాధురి కామెంట్లలో కొంత గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో శ్రీనివాస్ తో నా రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ సైతం మాధురి నా దగ్గరకు వచ్చి వెళుతుందని చెప్పుకొచ్చారు. మాధురి ఎన్నికల్లో తన కొరకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అవుతున్నాయి. మాధురి కామెంట్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయని ఆమె ఏదో దాస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.