* జగన్ ఓడించి ఏపీ ప్రజలు తప్పు చేశారా

* హామీలను నెరవేర్చడం నా బాధ్యత అంటూ చంద్రబాబు మోసం చేశారా

* ప్రజలు రియలైజ్ అవుతున్నారా

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

సాధారణంగా ఒక పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, నేతలు ఎంతో కొంత డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. సంపాదన అనేది చాలా వరకు అవినీతి మార్గాల్లోనే వస్తుంది. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ సంపాదించలేకపోయారు. దానికి కారణం జగన్ అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అనుమతించలేదు. అందువల్ల ఆయనపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. ఆ కసితోనే వీరు ఓట్లు వేయలేదని కూడా టాక్ నడిచింది. వైసీపీ కార్యకర్తల్లో కనీసం 40 శాతం మంది కూడా ఓట్లు వేయలేదట.

జగన్ ఓడిపోవాలని వాళ్లు ఇలా చేశారు కానీ ఇప్పుడు వారికే పెద్ద మైనస్ అయింది ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ కార్యకర్తల ఇళ్లపై నిమిషాలు చేస్తున్నారు వారిపై అటాక్స్ కూడా చేస్తున్నారు. సో వీళ్లకు వీరే నష్టం చేసుకున్నట్లు అయింది. జగన్ పరిపాలనలో ఏపీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తప్ప నేతలు అక్రమంగా డబ్బులు తిన్న సందర్భాలు చాలా తక్కువ. అవినీతి లేకుండా డబ్బులు అన్ని ప్రజలకే అందేలా చేసిన ఏకైక నేత జగన్.

మరోవైపు టీడీపీ ప్రభుత్వం చాలా అప్పులు ఉన్నాయంటూ, హామీలను నెరవేర్చే అవకాశమే లేదంటూ తన నిజ స్వరూపం బయటపెట్టింది. తల్లికి వందనం కింద రూ.15,000 ఇస్తామని బాబు అన్నారు కానీ ఎగ్గొట్టారు. రైతు భరోసా కింద రూ.20,000 రైతన్నలకు ఇవ్వాలి కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయలేదు. వసతి దీవెన, సున్నా వడ్డీ వంటి వాటి గురించి మాట్లాడటం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని బాబు గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వారే లేరు.

 ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. జాలర్లకు 20,000 ఇస్తామని కూడా మాట ఇచ్చి తప్పారు. స్కూల్ విద్యార్థులకు ఇంగ్లీషు స్పెషల్ క్లాసులు ఆపేశారు. రోజుకో మెనూ అనే విధానాన్ని పూర్తిగా తొలగించారు. పంటలకు ఉచిత బీమా ఎగొట్టారు. రేషన్, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లో నిలబెట్టే దుస్థితి వచ్చింది. వాలంటీర్లను కూడా దారుణంగా చీట్ చేశారు. పైపెచ్చు రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజల్లో తీవ్ర భయం కలిగిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు జగనే నయం అని రియలైజ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. బాబు గ్యారెంటీ లతో మోసం చేశారనే అసంతృప్తి పెరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: