తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా..2001.. ఏప్రిల్ 27న  BRS పార్టీని స్థాపించారు కేసీఆర్. ఇప్పటికీ ఈ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావోస్తోంది.. అలాగే 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా స్థాపించి తొమ్మిదేళ్లు అధికారంగా పార్టీని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ గా బిఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ పార్టీ రథోత్సవ సంబరానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 2014లో ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జాతీయస్థాయిలో విస్తరింపాలని లక్ష్యంతో 2022లో బారాస గా రూపాంతరం చెందింది.



ఇప్పుడు మళ్లీ రజోత్సవ సభ్యత తిరిగి తమ సత్తా చాటాలని పార్టీ అధినేత కేసిఆర్ ఈరోజు సాయంత్రం హనుమకొండ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందుకు కార్యకర్తలు కూడా భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభను విజయవంతం చేసే దిశగా బిఆర్ఎస్ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు సార్లు వరుసగా విజయాలతో దూసుకుపోయిన టిఆర్ఎస్ పార్టీ మూడవసారి ఓటమిని చవిచూసింది.


మొన్నటి లోకసభ ఎన్నికలలో ఒక్క సీటు  కూడా గెలవలేదు.. ప్రతిపక్షంలో భాగంగా ముఖ్య నాయకులు ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక 2001లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కెసిఆర్ తిరిగి సిద్దిపేట నుంచి మళ్లీ గెలిచారు. ఎంతోమంది మేధావులతో కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రజలలోకి ఉద్యమాన్ని తీసుకువెళ్లాల చేశారు కేసీఆర్. అలా 2014లో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎన్నో రాజకీయ ఎత్తుగడలతో విజయాన్ని అందుకున్నారు.


2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి పోటీ చేశారు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి మళ్ళీ 2009లో టిడిపి తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయంగా కూడా జేఏపీ ఏర్పాటు చేసి మరి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ పార్టీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలా ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో అమలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు రెండవసారి 2018లో భారీ మెజార్టీతో అందుకున్న టిఆర్ఎస్ 2023లో ఓడిపోయింది.. అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా అధికార పార్టీ కాంగ్రెస్ నేతల పైన చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు. మరి ఈరోజు సైతం రజోత్సవ కార్యక్రమాలతో కార్యకర్తలకు నేతలకు ఉత్సాహాన్ని నింపేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: