సాధారణంగా ప్రపంచంలో కల్లా ఎత్తైన బిల్డింగ్ ఎక్కడ ఉంది అంటే అందరూ కూడా దుబాయిలో ఉండే బూర్జు ఖలీఫా అనే చెబుతూ ఉంటారు. కానీ మన ఇండియాలో చాలా ఎత్తయిన బిల్లింగ్ ఏది అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ముంబైలో ఇంపీరియర్ టవర్ 1, టవర్ 2 మనదేశంలోని ఎత్తైన బిల్డింగుగా పేరు సంపాదించాయి. కానీ తెలంగాణ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాదులో ఎత్తైన బిల్డింగ్ కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


హైదరాబాద్ సిటీలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ కోకాపేటలో ఉండే సాస్ క్రౌన్ పేరుతో ఉన్నది. ఇదే నగరంలో ఇప్పటివరకు నిర్మించిన ఎత్తైన బిల్డింగ్ అని చెప్పవచ్చు. తెలంగాణలో ఈ బిల్డింగు అత్యంత ఎత్తైన బిల్డింగుగా గుర్తింపు పొందడమే కాకుండా 57 అంతస్తుల లో..4.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం ఉన్నది. అయితే ఈ భవనం చివరి ఫ్లోర్ నుంచి చూస్తే సగం వరకు హైదరాబాదే కనిపిస్తుందట. కింద నిలబడి చూస్తే ఆఖరి ఫ్లోర్ ఎక్కడ ఉందనే విషయం కూడా కనిపించదు.


ఇంత పెద్ద భవనం హైదరాబాద్ నగరానికి ఒక ల్యాండ్ మార్క్ గా నిలబడింది. అయితే ఇంత భారి బిల్డింగ్ కలిగిన ఈ బిల్డింగ్ కేవలం ఒక్క అంతస్తుకు ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంటుందట. ప్రస్తుతం నగరవ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్డింగులు చాలానే నిర్మాణ దశలో ఉన్నాయట. ప్రస్తుతం 62 అంతస్తులకు సంబంధించి ఒక భవనం కూడా తయారు చేయడానికి అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ 62 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి అయ్యిందంటే 57 అంతస్తులు భవనం రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ విషయం తెలిసిన హైదరాబాది వాసులందరూ కూడా ఈ భవనాన్ని తెగ చూసేస్తూ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: