వైసిపి నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి కార్యాలయం పైన దాడి కేసులో అరెస్టు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో సాక్షిగా ఉన్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేశారని వంశీ పైన కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో తాజాగా బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీకి బెయిల్ ఇచ్చారు. టిడిపి కార్యాలయం పైన దాడి అలాగే సత్య వర్ధన్ కిడ్నాప్ పై వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న  అరెస్టు చేశారు.


ఈరోజు రిమాండ్ ముగియడంతో పోలీసులు వంశీని కోర్టులో హాజరు పరచగా ఇరువురు వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇది తాను శ్వాసకోస ,గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా వల్లభనేని వంశీ చెప్పడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. గన్నవరం టిడిపి కార్యాలయం పైన దాడి జరిగిన సమయంలో ఆ కేసును తప్పు దావత్ పట్టించేందుకు  వంశి అనుచరులు సత్య వర్ధను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ పోలీసుల దర్యాప్తులలో తేలిందట.


తాను చెప్పినట్టుగా వినకపోతే తమ కుటుంబాన్ని అంతం చేస్తామంటూ సత్య వర్ధన్ ను బెదిరించారని తమకు అనుకూలంగానే వాంగ్మూలం ఇప్పించారని పోలీసులు విచారణలో తేలిందని తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఈ దర్యాప్తును సెంట్రల్ ఎసిసి దామోదర్ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో చార్జి షిట్ దాఖలు చేశారు. అయితే వల్లభనేని వంశీ అస్వస్థకు గురికాగా తనకి ఉన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడంతో వంశీ విజ్ఞప్తి మేరకు జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి బెయిల్ మీద బయటికి వస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: