
పాకిస్తాన్ ఐఏఎస్ కు సంబంధం ఉన్నటువంటి హాసన్ తో నిరంతర ఆమెకు టచ్చులోనే ఉంటూ కోడ్ భాషలలో చాలా విషయాలను మాట్లాడుకునేవారట.. అలాగే అవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి చాటింగ్ విషయంలోనే జ్యోతి పాకిస్తాన్లోనే తనని వివాహం చేసుకోవాలని కోరింది దీంతో పాటుగా భారత్ కు సంబంధించిన కొన్ని రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించుకున్నట్లు బయటపడ్డాయి. జ్యోతికి సంబంధించి నాలుగు బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయని దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమా అవుతూ ఉండేది అంటూ అధికారులు తెలిపారు.
ఇక ఈమె బ్యాంక్ అకౌంట్ ల పైన కూడా మరింత లోతుగా విచారణ కొనసాగించేందుకు చూస్తున్నామని తెలుపుతున్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఒక ఛానల్ ని కూడా నిర్వహించింది.. 2023లో పాకిస్తాన్ కి వెళ్ళిన సమయంలో ఈమెకు డానిష్ అనే వ్యక్తి పరిచయమయ్యారు.. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయ్యిందంటూ అధికారులు తెలియజేశారు. అతడి సూచనల మేరకే ఈమె ఆలీ అనే వ్యక్తిని కూడా కలిసినట్లుగా తెలియజేశారు.. అతడు పాకిస్తాన్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తి కావడం చేత జ్యోతి ద్వారా సమాచారాన్ని అందుకునే వారట. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా ఈమె పాకిస్థాన్ వ్యక్తులకు చేర వేసిందంటూ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వీటి పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారట. ఈమెకు సంబంధించి సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా నిలిపివేసినట్లు సమాచారం.