టిడిపి పార్టీ మహానాడుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి చేపడుతోంది. గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించి అన్ని పనులను కూడా కడప నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. కొంతమంది అధికారులు కూడా విధుల్లో పనిచేస్తూ ఉన్న సమయంలో ఇద్దరు వీఆర్వోలకు తీవ్రంగా గాయపడినట్లు వినిపిస్తున్నాయి. వేదిక సమీపంలో ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక భారీ కటౌట్ కింద పడడంతో వీఆర్వోలకు గాయాలయ్యాయని సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.


టీడీపి ఆధ్వర్యంలోనే ఈరోజు నుంచి గురువారం వరకు మహానాడు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా హాజరు కాబోతున్నారు. వీరి భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే మరొకవైపు వాతావరణం లో వచ్చిన మార్పుల వల్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి దీంతో ఆదివారం సాయంత్రం తీవ్రమైన గాలులతో మహానాడు సభ ప్రాంగణంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా వైయస్సార్ కడపలో మహానాడు నిర్వహించడం గమనార్హం.


మహానాడు సభకు ఏర్పాటు చేసినటువంటి వేదికకు సంబంధించి అన్నీ కూడా చెల్లాచెదరయ్యాయి.. అయితే అనంతరం వాటిని మళ్లీ యధాస్థితికి తీసుకురావడానికి అటు అధికారులతో పాటు కొంతమంది టీడీపీ నేతలు, కూలీలు కూడా తీవ్రంగా కష్టపడ్డారు. ముఖ్యంగా కటౌట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో హఠాత్తుగా రెండు కటౌట్లు కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు వీఆర్వోలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు  అక్కడ నేతలు తెలియజేస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయానికి పూర్తి చేశారు.. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.మహానాడు విందుకు సంబంధించి కూడా గత కొద్దిరోజులుగా పలు రకాల వంటలు ఉంటాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి విజయవంతంగా ఈ మహానాడు సభ కొనసాగాలని అటు నేతలతో పాటు, టిడిపి కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: