సాధారణంగా మనం మనం ఏదైనా ఆవులను కొనాలి అంటే  ధరలు 15 నుంచి 50 వేల రూపాయల మధ్యలో ఉంటాయి. ఎక్కువ పాలిచ్చే ఆవులు ఉంటే మరో 20 వేల రూపాయలు అదనంగా ధరను పెడుతూ ఉంటాము కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఆవు ధర రూ.10 లక్షల రూపాయలు పలికిందని విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు అంత ధర పెట్టి ఆవుని ఎందుకు కొన్నారు?.. మరి ఆ ఆవు యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాయన్నపేటలో  ఉండే గుమ్మి రామిరెడ్డి రాజ్ కోట్ నుంచి సుమారుగా నాలుగేళ్ల క్రితం రెండు గిరిజాతి ఆవులను తెప్పించుకొని మరి గోషాలను ప్రారంభించారట.. అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందడంతో రామిరెడ్డి దగ్గర ఏకంగా 132 గిరిజాతి ఆవులు ఉన్నాయట. ఇప్పుడు అమ్ముడుపోయిన రూ.10 లక్షల రూపాయల ఆవు ఉదయం 8 లీటర్లు సాయంత్రం 8 లీటర్లు చొప్పున ప్రతిరోజు ఏకంగా 16 లీటర్ల వరకు పాలు ఇస్తుందట. అయితే ఆవు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం చాలా అరుదు అని చెప్పవచ్చు.


ఈ గిర జాతి  ఆవుని తాజాగా ఏపీకి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఆవు కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల వారు ఈ ఆవుని కొనుగోలు చేశారట. సుమారుగా 10 లక్షల రూపాయల వరకు తీసుకొని ఈ ఆవుని నిన్నటి రోజున పెనుగొండ కి తరలివచ్చారు. ఇక ఈ ఆవును చూడడానికి అక్కడి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆవు గురించి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: