
జగన్ జనంలోకి వెళ్తే ఎలా అనే విషయంలో కూటమి సర్కార్ ఒకింత వింతగా ప్రవర్తిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ను కూటమి సర్కార్ ఎంత ఇబ్బంది పెడితే జగన్ కే మేలు జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ లో మూడు పార్టీలకు అయితే న్యాయం జరగడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం
జగన్ విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. జగన్ భవిష్యత్తులో పాదయాత్ర కూడా చేయనున్నారనే సంగతి తెలిసిందే. జగన్ ఒకింత దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం కూటమికి ఇబ్బందులు తప్పవని అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్షేమం విషయంలో జగన్ స్థాయిలో పథకాలను అమలు చేసే విషయంలో కూటమి సర్కార్ ఫెయిలైందని కామెంట్లు వ్యక్తయ్యాయి. అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం గమనార్హం. జగన్ రాబోయే రోజుల్లో తెలివైన వ్యూహాలతో ముందడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది. జగన్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు