
ఒక ప్రజా ప్రతినిధి అయ్యిండి కూడా తమ అభిమాన హీరో పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ వారు నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ని హైలెట్ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతూ ఉన్న ఈ ఆడియో పైన తాజాగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్లారిటీ ఇస్తూ.. తాను జూనియర్ ఎన్టీఆర్ ని అసభ్యకరమైన పదాలతో దూషించినట్లుగా సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ గా మారుతున్నది.. అది నిజం కాదు అంటూ తెలిపారు. అది ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చారు.
అంతేకాకుండా నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంటే తనకు చాలా అభిమానం.. తను అంటే గిట్టని వారే తన మీద ఒక ఫేక్ ఆడియో, వీడియోలను సృష్టించి ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారని.. దయచేసి ఎవరు ఇలాంటివి నమ్మవద్దండి ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని.. ఈ విషయం పైన అటు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానంటూ తెలియజేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. గత కొంతకాలంగా తనని టార్గెట్ చేస్తూ ఇలా తనమీద కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారాలను చేస్తూ ఉన్నారని మాట్లాడారు. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.