
ఆ మంత్రి రాసలీలలో మునిగి తేలుతున్నారని.. పని అయిపోయాక వెళ్లిపోతారంటూ తెలియజేశారు. దీంతో చాలామంది ఆ మంత్రి ఎవరా? అంటూ ఆరా తీస్తున్నారు. మరి స్టార్ హోటల్లో గడిపేవారు ఎవరైయుంటారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. హిందువులు సైతం ఎంతో పవిత్రంగా భావించే తిరుపతిలో మంత్రి రాసలీలలకు పాల్పడడం నీచాతి నీచమంటూ తప్పుపట్టారు.
పదవుల పేర్లతో మహిళలను ప్రలోభాలకు గురిచేసి వారిని వలలో వేసుకున్నటువంటి ఆ మంత్రి పైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలంటు భూమన డిమాండ్ చేయడం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ఆ మంత్రి రాసలీలపై అటు తిరుపతి టిడిపి ,జనసేన పార్టీ శ్రేణులలో ఒక చర్చ కొనసాగుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి హైదరాబాదులో చేసే రాసలీలలు అన్ని ఇన్ని కాదు అంటూ భూమన వెల్లడించారు.. చివరికి తిరుపతిలో కూడా ఇంత దారుణానికి ఓడిగడుతున్నారా అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా ఎన్.బి సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ మీలాంటి దమ్మున్న రాజకీయ నాయకుడే పార్టీలకు అవసరం ఏ పార్టీలో ఉన్న అక్కడ జరిగే తప్పులని వేలెత్తి చూపించడం నాయకుడి లక్షణం అంటూ తెలిపారు భూమన. మరి ఆ మంత్రి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఈ విషయంపై అటు టిడిపి పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.