ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు ఎవరూ కూడా హాజరు కాకపోవడంతో ఇటీవలే ఉప ఎన్నికలు జరుగుతాయనే విధంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణం రాజు కూడా ఇటీవలే ఒక మాట మాట్లాడారు.. పులివెందులకు ఉపఎన్నిక రాబోతున్నాయి అంటూ హెచ్చరించారు. ఒకవేళ పులివెందులకు వస్తే వైసిపి గెలిచిన 11 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. రాజ్యాంగంలో ఉండే రూల్స్ ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే.. స్పీకర్ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్గా వారు డిస్క్ క్వాలిఫై అవుతారు. లేకపోతే వారి మీద స్పీకర్ అనార్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగంలో ఉండే లాజిక్ ని తెలిపారు.



ఈనెల 18 నుంచి వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి.. వైసీపీ వాళ్లు రావాలి రాకపోతే వాళ్లు అనర్హులు అవుతారు.. ఇది రాజ్యాంగంలో ఉండే రూల్ ప్రకారమే తాము అనర్హత వేటు వేస్తామంటూ తెలిపారు RRR. అప్పుడే పులివెందులలో ఉప ఎన్నికలు వస్తాయి అంటూ మాట్లాడారు. ఇప్పటివరకు 37 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపగా ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పార్టీ నుంచి ఎవరు హాజరు కాలేదు. అయితే మరి కొంతమంది అసెంబ్లీకి వచ్చినట్టుగా అటెండర్ రిజిస్టర్లు సంతకం చేసి బయటనుంచే వెళ్లిపోయారు. అయితే వాటిని మేము అనుమతి ఇవ్వమంటూ స్పీకర్ తెలిపారు.


దీంతో మరో 23 రోజుల కనుక అసెంబ్లీలోకి వీరు రాకపోతే వారు డిస్ క్వాలిఫై అవుతారు. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు 10 నుంచి 12 రోజులు జరగబోతున్నాయి. మళ్లీ డిసెంబర్లో జరిగేటువంటి శీతాకాల సమావేశాలకు కూడా ఏ ఒక్కరోజు హాజరు కాకుండా ఉంటే కచ్చితంగా అర్హత వేటుపడుతుందని తెలిపారు స్పీకర్. దీంతో 11 మంది కూడా పదవులు కోల్పోతారు. ఈ 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది..


జగన్ అసెంబ్లీలోకి రాకపోవడానికి ముఖ్య కారణం మాట్లాడడానికి మైక్ ఇవ్వరని మైక్ ఇచ్చిన కట్ చేస్తారని  వెళ్లినా కూడా ఉపయోగం ఉండదు హేళన చేస్తారనే వాదన జగన్ది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కనీసం ఒక గంట అయినా ఉండి మన వాదనలు వినిపించి వచ్చేయాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సెక్షన్ లో మాత్రం ఈసారి ఎమ్మెల్యేలు హాజరయ్యా అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారో లేదో చూడాలి. మరి ఈ 11 స్థానాలు ఉప ఎన్నికల విషయంపై వైసీపీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: