
ఈ లిక్కర్ కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉన్నదని ఇలాంటి దశలో బెయిల్ ఇవ్వడం సరైనది కాదు అంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు సిట్ అధికారులు. ఈ కేసులో వీరికి వచ్చిన బెయిల్ మిగిలిన నిందితులకు కూడా అదే ఊరట దక్కేలా చేస్తుందని సెట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వీరికి ఇచ్చిన బెయిల్ రద్దయ్యేలా చేయవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నట్లుగా సీట్ అధికారుల వైపు నుంచి కనిపిస్తోంది. కేవలం లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులను దృష్టిలో పెట్టుకొని న్యాయపోరాటం చేస్తున్నారు సిట్ అధికారులు.
ఇప్పటికే రిమాండ్ లో మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేసేందుకు సైతం ఇందులో ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రమే మధ్యంతర బెయిల్ రాగా.. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తిరిగి మిథున్ రెడ్డి లొంగిపోవాలి.. నిందితులకు సైతం రిమాండ్ పొడిగించడానికి వారు నేరం చేసినట్టుగా సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవంటూ ఏసీబీ కోర్టు తెలియజేసింది. ఈ దశలోనే హైకోర్టును ఆశ్రయించిన సీట్ అధికారులకు మరి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి ఈ మరి.