ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసిపి కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలను మభ్య చేసి మోసం చేయడమే పాలనగా మారింది అంటూ ఫైర్ అయ్యారు. గతంలో జగన్ ఇచ్చినవే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా రూ.15000 ఇస్తామన్నారు, 5 లక్షల మంది పెన్షన్లకు కోత పెట్టారు. ఇది మోసం కాదా అంటూ ప్రశ్నించారు?.


అలాగే మహిళలకు ఆడబిడ్డలు నిది కింద ప్రతి నెల రూ.1500 ఇస్తామన్నారు, నిరుద్యోగులకు రూ .3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పటికి నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం 72 వేల రూపాయలు బాకీ పడిందని,  రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు అంటు జగన్ విమర్శించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు విషయంలో కూడా మాట తప్పారు. 50 ఏళ్లకు పెన్షన్లు ఇస్తానని చెప్పి రద్దు చేశారు.


సూపర్ సిక్స్ లో ఆడబిడ్డ నీది ఎగిరిపోయింది ,నిరుద్యోగ భృతి లేదు, అన్న క్యాంటీన్లను కొత్తగా తీసుకువచ్చి సూపర్ సిక్స్ లో భాగంగా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలే అనుకుంటున్నారు..అట్టర్ ప్లాప్ అయినా  సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేస్తూ మరి అనంతపురంలో బహిరంగ సభ పెట్టడం చాలా విడ్డూరం అంటూ చంద్రబాబును జగన్ విమర్శించారు. చంద్రబాబు అబద్దాలు మోసాలు, అనేవి ఒక స్థాయిలో ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆయన ఎన్నికల ముందు హామీలన్నిటిని నెరవేస్తానంటూ బాండ్లు పంపించారు అవన్నీ కూడా పచ్చి మోసమని ప్రజలకు తెలిసిపోయిందంటూ తెలిపారు. మొత్తానికి సీఎం చంద్రబాబు పైన జగన్ చేసిన కామెంట్లకు ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: