బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిశా పటాని ఒకరు. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమాలో దిశా పటాని అదిరిపోయి రేంజ్ లో అందాలను ఆరబోసింది. దానితో యూత్ ఆడియన్స్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ లభించింది. దానితో ఈమె వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తోంది అని చాలా మంది భావించారు. కానీ ఈమె లోఫర్ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడంపై ఎక్కువ ఆసక్తిని చూపించింది.

దానితో లోఫర్ సినిమా తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కడం , అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ నటి కొంత కాలం క్రితం ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD , సూర్య హీరోగా రూపొందిన కంగువా సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

తాజాగా ఈ బ్యూటీ కి ఓ క్రేజీ నటుడి సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్రేజీ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరో గా రూపొందబోయే ఓ సినిమాలో ఈ నటి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఆ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఈమెకు మంచి క్రేజ్ దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: