
జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజ నాయకులు ఒకే సమయంలో లేకపోవడంతో, తమిళనాడు రాజకీయాల్లో కొత్త నాయకత్వం కోసం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం స్టాలిన్ తప్ప పెద్ద స్థాయి నాయకుడు కనిపించడంలేదు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. తన చివరి సినిమాను కూడా రాజకీయంగా ఉపయోగపడేలా రూపొందించుకున్నారు. ఆ సినిమా విజయం సాధిస్తే, అది తన రాజకీయ యాత్రకు శుభసూచికంగా మారుతుందని ఆయన నమ్మకం. అయితే పొత్తుల విషయంలో విజయ్ ఇప్పటివరకు స్పష్టమైన వ్యూహం ప్రదర్శించలేదనే చర్చలు ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల ప్రత్యేక సమీకరణాలను ఎదుర్కొనడం ఆయనకు పెద్ద సవాలు కానుంది. అయినప్పటికీ, విజయ్ తనపై నమ్మకంతో, ఎంజీఆర్, జయలలితల మాదిరిగా ప్రజల్లో సంచలనాన్ని సృష్టిస్తానని భావిస్తున్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే, ఆయన స్టార్ ఇమేజ్ రాజకీయాల్లోనూ అదే స్థాయి విజయాన్ని అందిస్తుందా అన్నది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు