
స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో లోకేష్ కి చాలా మంచి పేరు వచ్చింది, పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు హ్యాపీ గా ఉన్నారు. ఇప్పుడు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రంగంలో నారా లోకేష్ మార్క్ విప్లవం నడుస్తోందన్న చర్చలు వినిపిస్తున్నాయి. స్కూల్ యూనిఫామ్ తో మొదలు పెడితే, బ్యాగ్, బెల్ట్ క్వాలిటీ బాగుంది అని టాక్ ఉంది. జగన్ కూడా ఇవన్నీ ఇచ్చారు. కానీ (క్వాలిటీ అటు ఇటుగా) తన బొమ్మ వేసుకుని క్రెడిట్ రాకుండా చేసుకున్నాడని.. కానీ ఇప్పుడు లోకేష్ అందుకు భిన్నంగా వెళుతున్నాడంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. పుస్తకాలు, సిలబస్ ఇంప్రూవ్మెంట్, మధ్యాహ్నా భోజనం అన్ని బాగున్నాయి అంటోన్న వారి సంఖ్య చాలా ఎక్కువుగా ఉంది.
పేరెంట్ టీచర్ మీటింగ్ లు వల్ల పేరెంట్స్ ఇన్వాల్‌మెంట్ పెరిగి, జరుగుతున్న మార్పుని అప్రిషియేట్ చెయ్యగలుగుతున్నారు. ఇక కొత్త డీఎస్సీ ద్వారా చేరిన టీచర్స్ చేరితే ఇంకా బాగుంటుంది. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో లోకేష్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఫ్యూచర్ లొ ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాడు ఇలా 6 నెలలు ఫీ రీయింబర్స్మెంట్ బాకీ పెట్టారు. దెబ్బలాడి ఇప్పించుకోవాల్సింది కదా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో చేసిన రెవల్యూషనరీ మార్పులు చెయ్యలేదు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా సరిగా కాన్‌సంట్రేషన్ చేయలేదనే అంటున్నారు. ఏదేమైనా స్కూల్ ఎడ్యుకేషన్ లో లోకేష్ మార్పులు మాత్రం భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు బాటలు వేస్తాయని మేథావులు అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు