కొంతమంది నటీనటులు ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కానీ ఎంతో ఫేమస్ అవుతారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ శ్వేతా బసూ ప్రసాద్.. ఈమె చేసిన ఒక్క సినిమానే ఎంతో పేరు తీసుకువచ్చింది. అదే కొత్త బంగారులోకం సినిమా.. అప్పట్లో యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్నటు వంటి ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులో హీరోగా వరుణ్ సందేశ్ నటించగా.. శ్వేతా బసూ ప్రసాద్ హీరోయిన్ గా.. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేశారు.. అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. అలా ఓవర్ నైట్ లోనే ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి శ్వేతా బసూ ప్రసాద్ ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో ఆమె కాస్త ఫేడ్ అవుట్ హీరోయిన్ గా మారిపోయింది. అలా బాలీవుడ్లో పలు సిరీస్ లు చేసుకుంటూ హీరోయిన్ గా రాణిస్తోంది. 

అయితే అలాంటి శ్వేతా బసూ ప్రసాద్ తాజాగా రెడ్ లైట్ ఏరియా సందర్శన గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తను లాక్ డౌన్ సమయంలో  ఇండియా లాక్ డౌన్ అనే చిత్రంలో నటించాలని తెలియజేసింది. అయితే ఈ చిత్రంలో భాగంగా ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే మహిళల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆ ఏరియాకి వెళ్లానని, ఆ సమయంలో వారి ఇబ్బందులు ఎన్నో తెలుసుకోగలిగానని దాని ద్వారానే ఆ చిత్రంలో నేను బాగా నటించానని అన్నది. ఈ సినిమాలో అద్భుతంగా నటించడం కోసమే ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామటిపురాను సందర్శించానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆ పాత్రకు న్యాయం చేసుకోవడానికి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నానని అన్నది. ఈ సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయని దీంతో సోషల్ మీడియాలో నాపై రకరకాలుగా చర్చ చేశారని చెప్పుకొచ్చింది.

 అయితే కొత్త బంగారులోకం సినిమా సమయంలో శ్వేతా బసూ ప్రసాద్ చాలా బొద్దుగా ఉండేది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సన్న జాజి తీగలాగా మారిపోయింది.. అద్భుతమైన అందాలతో యూత్ ను ఆకట్టుకుంటుంది.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అలాంటి ఈమె రెడ్ లైట్ ఏరియా గురించి అక్కడ ఉండేవారి పరిస్థితుల గురించి మాట్లాడడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా అన్వయిస్తూ శ్వేతా బసూ ప్రసాద్  రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం  చేస్తూ దొరికిపోయిందంటూ కొంతమంది పెద్ద పుకారులు తెర లేపారు.. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకారు కాస్త సద్దుమనిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: